telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నువ్వు నేర్పిన పాఠాలు… అడుక్కు తినటానికి కూడా పనికొచ్చేవాడిని కాదు : అజయ్ భూపతి

Ajay

ఆర్ఎక్స్ దర్శకుడు అజయ్ భూపతి తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అయిన అజయ్ భూపతి ఆయనకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ మరో గురువు అయిన క్యాంప్ శశి గురించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ” నేను నా గురువులాగా భావించింది ఇద్దరినే.. ఒకరు రామ్ గోపాల్ వర్మ అయితే, రెండో వ్యక్తి క్యాంప్ శశి… నువ్వు నాకు నేర్పిన పాఠాలు ఉన్నాయే, నీ మాటలు వినుంటే అడుక్కు తినటానికి కూడా పనికొచ్చేవాడిని కాదు!!” అని అజయ్ భూపతి ట్విట్టర్ లో రాసుకొచ్చారు. దానికి హ్యాపీ టీచర్స్ డే అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసాడు అజయ్. అయితే అజయ్ భూపతి సదరు వ్యక్తిని తిడుతూ పోస్ట్ పెట్టారా..? లేక వెటకారంగా పోస్ట్ పెట్టారా..? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. కాగా నేడు ఉపాధ్యాయుల దినోత్సం. ఈ సందర్భముగా సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా వేదికగా తమ గురువులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related posts