*వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా సంచలన నిర్ణయం
*ఇక నుంచి బజర్తస్త్ షోకి ఆర్కే రోజా గుడ్‌బై
*టీవీ సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యను..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన మంత్రి వర్గంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చోటు దక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్కే రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి అయినందుకు టీవీ సినిమా షూటింగ్‌లు ఇక నుంచి మానేస్తున్నాని ఆమె ప్రకటించారు. అలాగే బజర్తస్త్ షోలో పాల్గొనను’ అని రోజా ప్రకటించారు.
హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో తనకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చిన జబర్దస్త్ కామెడీ షోకి ఆమె గుడ్ బై చెప్పారు. దాదాపు పదేళ్లుగా జబర్దస్త్ జడ్జిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఓ వైపు ఎమ్మెల్యేగా ఉంటూనే షోలలో పాల్గొంటున్నారామె. ఐతే రాష్ట్ర మంత్రివంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కామెడీ షోలు చేయడం సరికాదని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే జగనన్న ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేస్తానని రోజా ప్రకటించారు. ప్రాణం ఉన్నంతవరకు సీఎం జగనన్నతోనే ఉంటానని, ఆయన కోసమే పని చేస్తానని రోజా అన్నారు. తనకు సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపును ఎప్పటికి మర్చిపోలేనని అన్నారు
ఈ సమయంలో సినిమా ప్రమోషన్స్ అవసరమా ?