telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మ‌న్మ‌థుడు-2” నుంచి మొదటి పాట

Manmadhudu-2

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున న‌టించిన తాజా చిత్రం “మ‌న్మ‌థుడు-2”. చిల‌సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ప‌ని చేస్తున్నారు. ఫ‌న్ రైడ్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ పెళ్ళికాని మ‌ధ్య వ‌య‌స్కుడిగా అలరించ‌నున్నాడు. ఈ నేప‌థ్యంలో చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు. “హే మానియా…” అంటూ సాగే ఈ పాట ట్రెండీగా ఉంటూ ఆకట్టుకుంటోంది. నాగార్జున స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ వీడియో సాంగ్ లో నాగార్జున ఇంగ్లీషు భామలతో రొమాన్స్ అదరగొట్టేశాడు. మీరు కూడా ఈ పాటను వీక్షించండి.

Related posts