telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆస్ట్రేలియాకు సరైన ఫినిషర్‌ లేడు : పాంటింగ్

ఆస్ట్రేలియాలో బిగ్ హిట్టర్స్ ఉన్నా.. వారంతా టాపార్డర్‌లోనే ఆడుతున్నారని తెలిపాడు. దాంతోనే జట్టుకు కావాల్సిన ఫినిషర్ దొరకడం లేదని చెప్పుకొచ్చాడు ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌. తాజాగా పాంటింగ్ మాట్లాడుతూ… ‘ధోనీ కెరీర్‌ సాగినంత కాలం ఫినిషర్​గానే ఆడాడు. ఆ స్థానంలో తనదైన ముద్ర వేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌ కూడా అలాంటి ఆటగాళ్లే. తమ దేశాలకు, లేదా ఐపీఎల్‌ జట్లకు నిలకడగా విజయాలు అందిస్తారు. వాళ్లిద్దరూ ఆయా స్థానాలకు పరిమితమయ్యారు. అయితే, ఆస్ట్రేలియా జట్టులో సరైన ఫినిషర్‌ లేకపోడానికి ప్రధాన కారణం.. అందులో బాగా ఆడే ఆటగాళ్లంతా బిగ్‌బాష్‌ లీగ్‌లో టాప్‌లోనే ఆడతారు.’అని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టులో ఫినిషర్‌ స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్‌ లేరని, అలాంటి ఆటగాడి కోసమే వెతకాల్సి ఉందని మాజీ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు.‘ప్రస్తుత పరిస్థితుల్లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌, మార్కస్‌ స్టోయినిస్‌లను మ్యాచ్‌ ఫినిషర్లుగా పరిగణించాల్సి ఉందా? కానీ ఆ ముగ్గురూ బిగ్‌బాష్‌లో టాప్‌ఆర్డర్‌లో ఆడతారు. వారిని లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయమని ఆయా జట్లను కోరడం కష్టం.’అని పాంటింగ్ తెలిపాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు కోచ్‌గా ఉన్న పాంటింగ్‌.. స్టోయినిస్‌ను మ్యాచ్‌ ఫినిషర్‌గా చూడాలనుకున్నట్లు చెప్పాడు.

Related posts