telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్ష

డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతున్న ఈ అంతర్జాతీయ సదస్సుపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే ఈ సదస్సుతో పాటు రాష్ట్రానికి అత్యంత కీలకమైన దార్శనిక పత్రం తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ విడుదల చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఈ అంశాలపై వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.

ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) లో ఈ అంశాలపై వరుస సమావేశాలను నిర్వహిస్తూ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, 2047 నాటికి తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంపై తుదిమెరుగులు దిద్దనున్నారు.

ఈ వరుస సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు అంశాల వారిగా జరిగే సమీక్షల్లో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.

Related posts