ఏపీ శాసన మండలిలో శ్రీశైలం రిజర్వాయర్ వరద నీటి వినియోగంపై వాడి వేడిగా చర్చ జరిగింది. అధికార వైసీపీ సభ్యులు గత ప్రభుత్వం అనుసరించిన వైఖరిని విమర్శించారు. ఈ అంశంపై మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఎండిపోయేలా చేసిందని విమర్శించారు.
తాము అధికారంలోకి రాగానే చెరువులకు నీళ్లిచ్చామన్నారు. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఇవన్నీ విస్మరించి ప్రతిపక్ష నేతలు విమర్శలకు దిగారని పేర్కొన్నారు. తాము చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.



సికింద్రాబాద్ అభివృద్ధే తన లక్ష్యం: కిషన్ రెడ్డి