ఇంటర్నెట్ తో పాటు దేశ భద్రత చాలా ముఖ్యమని కేంద్ర ఐటీ, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్ అన్నారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపచేసేందుకు పాకిస్థాన్, ఇంటర్నెట్ ను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
ఇంటర్నెట్ వాడకం తమకున్న ఓ హక్కని ప్రజల్లో ఉన్న భావనను తొలగించాల్సిన అవసరం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్ ద్వారా అభిప్రాయాలు పంచుకోవడం భావ వ్యక్తీకరణ హక్కులో ఓ భాగం మాత్రమేనని, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

