telugu navyamedia
సినిమా వార్తలు

“రష్మీ రాకెట్” పోస్టర్… గ్రామీణ యువతిగా తాప్సి

Rashmi-Rpcket

వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ ప్రయోగాత్మకమైన పాత్రలతో బాలీవుడ్ లో హీరోయిన్ గా దూసుకెళ్తోంది తాప్సి. తాజాగా ఈ మిల్కి బ్యూటీ అథ్లెట్‌గా కొత్త పాత్రలో కనిపించబోతున్నది. తాప్సీ ప్రధాన పాత్రలో “రష్మీ రాకెట్” పేరుతో ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతున్నది. ఆకర్ష్ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్య్రూవాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఎరుపు రంగు దుస్తుల్లో ముక్కుపుడక ధరించి గ్రామీణ ప్రాంత యువతిగా తాప్సీ వినూత్న లుక్‌తో కనిపిస్తున్నది. ఏడారి ప్రాంతంలో మొదలుపెట్టి రేస్ ట్రాక్‌పై తాప్సీ పరిగెడుతున్న దృశ్యాల్ని ఈ మోషన్‌ పోస్టర్‌లో చూపించారు. ఈ సినిమాలో గుజరాత్‌కు చెందిన రష్మీ అనే అథ్లెట్ పాత్రలో ఆమె కనిపించబోతున్నది. ఈ సందర్భంగా తాప్సి మాట్లాడుతూ “రెగ్యులర్ అథ్లెటిక్ కథలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. కథలోని నాటకీయత, మానవీయ కోణం నచ్చి సినిమాను అంగీకరించాను. పూర్తిస్థాయి క్రీడా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది” అని తాప్సీ చెప్పింది. ఓ గ్రామీణ ప్రాంత యువతి అంతర్జాతీయ అథ్లెట్‌గా ఎదిగిన వైనాన్ని స్ఫూర్తిదాయకంగా ఇందులో ఆవిష్కరించబోతున్నట్లు చిత్రబృందం చెబుతున్నది.

Related posts