telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అత్తారింట్లో రానా దసరా సంబరాలు

Rana

దగ్గుబాటి వారసుడు, స్టార్ హీరో రానా తన సతీమణి మిహీకా బజాజ్‌తో కలిసి అత్తారింట్లో దసరా సంబరాలు చేసుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలో రానా అత్తయ్య బంటీ బజాజ్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో బ్యాచిలర్‌ లైఫ్‌కి గుడ్‌బాయ్‌ చెప్పి తన మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లేశారు దగ్గుబాటి రానా. పెళ్లైన తర్వాత నవదంపతులు రానా, మిహికాకు ఇదే తొలి దసరా. హైదరాబాద్‌లోనే ఉన్న మిహీక ఇంట్లో రానా చేసిన సందడి, అత్తా మామలతో దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ట్రెడీషనల్ లుక్‌లో కనిపిస్తూ రానా- మిహీక దంపతులు మెరిసిపోతున్నారు. తమ అభిమాన తార రానా జోడీని చూసి మురిసిపోతూ ఆయనకు ప్రత్యేకంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు. ఇక రానా అరణ్య, హిరణ్యకశ్యప, విరాట పర్వం సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలను లైన్‌లో పెట్టారు.

 

View this post on Instagram

 

Happy Dussehra @ranadaggubati @miheeka

A post shared by Bunty Bajaj (@buntybajaj) on

Related posts