దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయస్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నికల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్రమిది. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్ ఏ దర్శకుడితో కలిసి పనిచేస్తాడనే దానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. చరణ్ తదుపరి ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనే దానిపై పలు వార్తలు వినపడుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన పలు ప్రముఖ దర్శకుల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. లేటెస్ట్ సమాచారం మేరకు కొరటాల శివ..రామ్‌చరణ్ నెక్ట్స్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడట. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ చిరు 153 సినిమా నిర్మాణంలో బిజీ అవుతాడట. సినిమా వర్గాల వార్తల ప్రకారం వీరివురి కలయికలో సినిమా ఫిబ్రవరి నుండి ప్రారంభం అవుతుందని టాక్.
previous post
next post

