telugu navyamedia
సినిమా వార్తలు

పోలీస్ చేతిలో 36 సార్లు దెబ్బలు తిన్న యంగ్ హీరో

NIkhil

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా రూపొందుతున్న చిత్రం “అర్జున్ సురవరం”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం పోలీస్ చేతిలో 36 సార్లు దెబ్బలు తిన్నట్లు చెప్పుకొచ్చాడు నిఖిల్. సినిమాలో ఓ సన్నివేశంలో పోలీస్ ఆఫీసర్ చేతిలో దెబ్బలు తినాలి. పోలీస్ కొట్టగానే నిఖిల్ ఫోర్స్ గా కిందపడిపోవాలి. అయితే ఈ సీన్ చేయడానికి 36 టేక్స్ తీసుకున్నానని నిఖిల్ చెప్పాడు. అలా షూటింగ్ లో భాగంగా పోలీస్ చేతిలో 36 సార్లు దెబ్బలు తిన్నట్లు చెప్పుకొచ్చాడు. మరో సన్నివేశంలో లావణ్యతో చెంపదెబ్బ తినాలని, అది మాత్రం లక్కీగా ఒకే టేక్ లో పూర్తయిందంటూ గుర్తు చేసుకున్నాడు. షూటింగ్ కోసం బాగా కష్టపడ్డామని డూప్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్స్ చేశామని వెల్లడించారు.

Related posts