telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

త్వరలో మెట్రో రైల్ పాస్‌లు!

5.5 km metro corridor in patabasti

హైదరాబాద్ మెట్రో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ టికెటింగ్ విధానానికి ప్రయాణికుల మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఈ క్యూఆర్ కోడ్ విధానంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 60 వేలకు చేరినట్టు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ విధానం వల్ల టికెట్ల కోసం క్యూలలో నిల్చునే బాధ తప్పుతుందన్నారు. క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ఫీడర్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చన్నారు. మరో రెండు మూడు రోజుల్లో పాస్‌లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఆర్టీసీ, ఉబెర్ వంటి సంస్థలతోనూ భాగస్వామ్యం కుదుర్చుకుని ఒకే టికెట్‌పై ప్రయాణించే వెసులుబాటును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ గురించి మెట్రో ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రైలును ప్రతి రోజూ శుభ్రం చేస్తున్నట్టు చెప్పారు.

Related posts