telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అసభ్యంగా తాకేవాళ్ళు ఎక్కువవుతున్నారు… ఆ తేడాగాళ్లను ముందే పసిగట్టాలి : రకుల్

Rakul

రకుల్ “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్”తో తెలుగు వారికి దగ్గరైంది. ఆ తరువాత ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్య తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. ఇటీవల అజయ్ దేవ్‌గన్‌తో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమా చేసింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. కాగా అటు తమిళం, ఇటు తెలుగు నుంచి అవకాశాలు పెద్దగా లేకపోవడంతో రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం తమిళ్‌లో 2, హిందీలో ఒక సినిమా, తెలుగులో ఒక సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రైవేట్‌ ఈవెంట్స్‌లోనూ సందడి చేస్తోంది. తాజాగా ఈ భామ శనివారం వైజాగ్‌లో జరిగిన `555 కిలో మీటర్ల 2.0 వాక్‌` ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారి భద్రత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలకు చిన్న వయసు నుంచే లైగింక వేదింపుల మీద అవగాహన కల్పించాలని అభిప్రాయ పడింది రకుల్‌. ముఖ్యంగా సమాజంలో అమ్మాయిలను ఇబ్బంది పెట్టేలా అసభ్యంగా తాకేవాళ్లు ఎక్కువవుతున్నారని, అలాంటి వాళ్లను ముందుగానే పసిగట్టేలా అమ్మాయిలను మానసికంగా సిద్ధం చేయాలనంది రకుల్‌. అలా చేసే వాళ్లు తేడాగాళ్లని ముందే పసిగట్టాలి. వారి గురించి వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన నిర్వహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

Related posts