శ్రీ శక్తి స్వరూప్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుబ్బు వేదుల దర్శకత్వంలో అభిరామ్ వర్మ, కృతి గార్గ్, స్వప్నిక, కాలకేయ ప్రభాకర్, సత్యం రాజేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లవ్ అండ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ “రాహు”. ఏవీఆర్ స్వామి, రాజా దేవరకొండ, శ్రీ శక్తి బాబ్జీ, సుబ్బు వేదుల కలిసి నిర్మిస్తున్నారు. ‘రాంగ్ టైమ్, రాంగ్ ప్లేస్, రాంగ్ గర్ల్’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. తాజాగా “రాహు” టీజర్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. “రాహువు సూర్యుణ్ణి పట్టుకుంటే అది గ్రహణం.. అంతా చీకటి.. మనలోని భయం, స్ట్రెస్ మన చూపుని పట్టుకుంటే అది కన్వర్షన్ డిజార్డర్.. అప్పుడు కూడా అంతా చీకటే’.. అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ‘బ్లడ్ చూస్తే స్ట్రెస్ ఎక్కువై నాకు కళ్లు కనబడవ్” అని హీరోయిన్ చెప్పడం, దానికి సైకియాట్రిస్ట్.. “ఎప్పుడు నీకు స్ట్రెస్ వచ్చినా ఈ పెన్ క్లిక్ చేస్తూ నంబర్స్ కౌంట్ చెయ్.. అప్పుడు నీ స్ట్రెస్ తగ్గి మళ్లీ చూడగలుగుతావ్” అని ఆమెకి చెప్పడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.
previous post
next post