telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వందనాలు జాతిపితా

how gandhiji suicide is a question to
వందనాలు జాతిపితా
సుందరమే నీ చరితా !
తెల్లవార్ని తరిమి కొట్టి
స్వతంత్రమిడె నేతా !
బాలునిగా అల్లరులూ
యువకునిగ చిరుతప్పులూ
దక్షిణాఫ్రికాలోనూ
రైలున అవమానాలూ!
మార్చినాయి మీమనసును
కూర్చినాయి లక్ష్యమును
దాస్యపు సంకెళ్లు విడగ
చేర్చినాయి విప్లవమును!
అహింసయే నీదు బాట
స్వపరి పాలనము నోట
సహాయ నిరాకరణమును
సాధించగ ప్రతీ చోట !
ఊరు వాడ కదిలిందీ
పిడికిళ్లను బిగించింది
వందేమాతరమనగా
భరతమాత నవ్విందీ !!

Related posts