దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో కర్ణాటక ప్రభుత్వం ఆయనను ఘనంగా సన్మానించనుంది. ఆయన మరణించి ఇన్ని రోజులు అయినప్పటికీ ఫ్యాన్స్ ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రతీ రోజూ లక్షలాది మంది ఆభిమానులు ఆయన సమాధిని దర్శించుకుని నివాళులు ఆర్పిస్తున్నారు.
ఇటీవలే బెంగుళూరు నగరంలోనిలో ప్యాలెస్ గ్రౌండ్స్‌లో సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రభుత్వ పెద్దలుతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీమా పరిశ్రమల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించారు CM బసవరాజు బొమ్మై. దేశంలోనే పవర్ఫుల్ అవార్డ్ అయిన కర్నాటక రత్న అవార్డును పునీత్‌కు నివాళిగా ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
పునీత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. చాలామందితో సమాలోచనలు చేసిన తరువాత పునీత్‌కు కర్ణాటక అత్యున్నత పురస్కారమైన కర్ణాటక రత్నను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.అప్పుకు కర్ణాటక రత్న అవార్డు ప్రకటించగానే కార్యక్రమానికి వచ్చిన మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, ప్రతిపక్ష సిద్ధ రామయ్యతో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా లేచి కరతాళధ్వనులతో తమ సమ్మతిని తెలిపారు.
కాగా.. కర్ణాటక రత్న అవార్డును 1992లో స్థాపించబడిన ఈ అవార్డును.. ఇప్పటివరకు ఎనిమిది మందికి మాత్రమే కర్ణాటక రత్న అవార్డు లభించింది. మరణానంతరం ఈ అవార్డును అందుకున్న 10వ వ్యక్తిగా పవర్ స్టార్ నిలవనున్నారు. ఈ అవార్డుతోపాటు బహుమతిలో 50 గ్రాముల బంగారు పతకం, కృతజ్ఞతా పత్రం అందజేయడం జరుగుతుంది.
కేసీఆర్ మనసు బంగారం… ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు