telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత ఎస్.కె.కృష్ణకాంత్ కన్నుమూత

SK Krishnakanth

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత ఎస్.కె.కృష్ణకాంత్ బుధవారం మరణించారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. కృష్ణకాంత్‌కు ఇద్దరు కొడుకులున్నారు. కృష్ణకాంత్ గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు అయితే బుధవారం సాయంత్రం చెన్నైలోని తన నివాసంలో గుండెపోటు కారణంగా మరణించారు. కృష్ణకాంత్‌ భౌతికకాయానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు సినీ ప్రముఖులు కృష్ణకాంత్ మృతిపట్ల సంతాపం తెలిపారు. కాగా లక్ష్మీ మూవీ మేకర్స్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేసిన కృష్ణకాంత్‌ తర్వాత తిరిడి చిత్రం ద్వారా నిర్మాతగా కెరీర్‌ మొదలుపెట్టారు. కృష్ణకాంత్ శింబు నటించిన మన్మథుడు,కింగ్, పుదుకోట్టైలిరిందు శరవణన్, చొల్లి అడిప్పేన్, మచ్చి చిత్రాలను నిర్మించారు. అయితే ఇలా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Related posts