telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ “సర్కార్ వారి పాట” టాటూ వెనుక అసలు కథ…!!

SVP

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం “సర్కార్ వారి పాట”. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో మహేష్ మొహం కనిపించకుండా డిజైన్ చేయగా… చెవికి పోగు, మెడపై రూపాయి టాటూతో అదరగొట్టాడు మహేష్. ప్రస్తుతం ఈ లుక్ లో మహేష్ రూపాయి టాటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. అయితే ఈ టాటూ వెనక ఒక కథ ఉందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కథపరంగా మొదట రూపాయ పచ్చబొట్టు అనుకోలేదట.. డాలర్ టాటూ అనుకున్నారట. ఈ సినిమా కథ విదేశాల్లో జరుగుతుందట. కథకు అనుగుణంగా డాలర్ టాటూ అనుకున్నా.. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విదేశాల్లో షూటింగ్ జరిగే పరిస్థితి లేదు. దాంతో కథను ఇండియా కు షిఫ్ట్ చేశారట. కథను ఇండియా నేపథ్యానికి అనుగుణంగా మార్చారట. అందులో భాగంగా ఆ టాటూ ను రూపాయగా మార్చారట.ఏదిఏమైనా మహేష్ టాటూ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.

Related posts