telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మేనకోడలితో ప్రియాంక చోప్రా జలకాలాటలు… వీడియో వైరల్

bollywood actor priyanka wax statues

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గత ఏడాది అమెరికాకు చెందిన ప్రముఖ పాప్‌సింగర్ నిక్ జొనాస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి… హాలీవుడ్‌లోనూ క్వాంటికో సిరీస్‌లో ప్రతిభ చాటి తనేంటో ప్రపంచానికి తెలియజేసింది. ప్రియాంక చోప్రా దాదాపు మూడేళ్ళ‌ త‌ర్వాత హిందీలో “ది స్కై ఈజ్ పింక్” అనే చిత్రంలో న‌టించింది. ఈ చిత్రంలో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా నటించారు. ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, ప్రియాంక చోప్రాలు 2005లో “దిల్ ద‌ఢ్‌ఖ‌నే దో” అనే చిత్రంతో తొలిసారి ప్రేక్ష‌కుల ముందుకు రాగా, “ది స్కైజ్ ఈజ్‌ పింక్” వీరిద్ద‌రు క‌లిసి నటించిన రెండో చిత్రం. ఇందులో ప్రియాంక 21 ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కన్పించింది. సోనాలి బోస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న “ది స్కై ఈజ్‌ పింక్‌” చిత్రంలో జైరా వ‌సీమ్ ముఖ్య పాత్ర‌లో, ప్రియాంక త‌ల్లిగా జ‌రీనా నటించారు. ప్రియాంక న‌టించిన ది స్కై ఈజ్ పింక్ చిత్రం గ‌త శుక్రవారం విడుద‌ల కాగా, దీనికి మంచి రివ్యూస్ వ‌చ్చాయి. క‌లెక్ష‌న్స్‌లో మాత్రం బోల్తా ప‌డింది. ఈ చిత్రం ప్రమోష‌న్స్‌లో భాగంగా ప్రియాంక కొద్దీ రోజుల క్రితం ఇండియాకి వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం త‌న ఫ్యామిలీతో స‌ర‌దాగా గడుపుతున్న ప్రియాంక తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో త‌న మేన‌కోడ‌లితో ఆడుకుంటూ.. నువ్వు అందంగా ఉన్నావంటే నువ్వు అందంగా ఉన్నావ‌ని ఒక‌రిపై ఒక‌రు పొగ‌డ్త‌లు కురిపించుకుంటున్నారు. ప్రియాంక చోప్రా షేర్ చేసిన వీడియో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

 

View this post on Instagram

 

We’re so cute ! @sky.krishna ❤️ #positiveaffirmations #blessednotstressed #girllove 📸 @divya_jyoti

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Related posts