telugu navyamedia
తెలంగాణ వార్తలు

‘మేం బ్యాంకులను మాత్రమే దోచుకుంటాం కానీ.. మీరు దేశాన్నే దోచుకుంటున్నారు

హైదరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. ‘సాలు దొర.. సెలవు దొర’ అంటూ బీజేపీ ఏర్పాటు చేసిన బోర్డుతో మొదలైన వివాదం.. ఇప్పుడు తారా స్థాయికి చేరింది. బీజేపీ కౌంటర్‌కు ఇస్తూ.. వినూత్న ప్రచారం చేస్తోంది టీఆర్ఎస్. నగరంలో దొంగలు సంచరిస్తున్నారంటూ.. కౌంటర్ ఇస్తున్నారు.

హైదరాబాద్‌లో కొంత మంది వ్యక్తులు దొంగల గెటప్‌ వేసుకొని.. బ్యాంకుల ముందు నిలబడుతున్నారు. వారి చేతిలో ఓ ప్లకార్డు కనిపిస్తోంది. ‘మేం బ్యాంకులను మాత్రమే దోచుకుంటాం కానీ.. మీరు దేశాన్నే దోచుకుంటున్నారు.’ అని దానిపై రాసి ఉంది. దానితో పాటు బై బై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ రాశారు.

 ప్రధాని మోదీ దేశాన్ని దోచుకుంటున్నారని.. ప్లకార్డు ప్రదర్శిస్తున్న ఓ వ్యక్తి

 

ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎల్ఐసీ కార్యాలయాలు, రైల్వే స్టేషన్ల ముందు ఇలాంటి ప్లకార్డులు పట్టుకొని కొందరు వ్యక్తులు తిరుగుతున్నారు. వారిని టీఆర్ఎస్ పార్టీయే పంపించిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రచార హోర్డింగ్స్

మ‌రోవైపు ..భాగ్యనగరంలో ఎటుచూసినా కమలం, గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాల కోసం కాషాయ జెండాలు దర్శనమిస్తుండగా.. రాష్ట్రపతి ఎన్నికల విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాక సందర్భంగా తెరాస జెండాలు వెలిశాయి. నగరంలోని ప్రధాన కూడళ్లు , రోడ్లు కాషాయ, గులాబీ వర్ణాలతో సరికొత్త రంగును పులుముకున్నాయి

Related posts