telugu navyamedia
సినిమా వార్తలు

”లైగర్” నుంచి విజయ్‌ దేవరకొండ బోల్డ్ లుక్ రివిల్‌

విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘లైగర్’ . దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా లెవెల్లో  ఆగస్టు 25న విడుదల ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌ను కాస్త డిఫరెంట్‌గానే ప్రమోట్ చేస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే తాజాగా విజయ్‌ దేవరకొండ సంబంధించి ఓ షాకింగ్ పోస్టర్​ను విడుదల చేసింది.

‘నటన పరంగా మానసికంగా, శారీరకంగా ఈ సినిమా కోసం నా సర్వస్వం పెట్టాను. ఇది ఎంతో ఛాలేంజింగ్‌ రోల్‌. నేను మీకు అన్ని ఇస్తాను. త్వరలో లైగర్‌ వచ్చేస్తుంది’ అని  విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఇందులో విజయ్​కండలు తిరిగిన దేహంతో బోల్డ్​ లుక్​లో రోజా పూలు పట్టుకుని నిలబడి ఉన్నాడు.

vijay devarkonda bold look

ఈ పోస్టర్​ విజయ్​ ఫ్యాన్స్​ను ఆకట్టుకోగా.. మిగతావారు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ‘సెక్సియస్ట్​ పోస్టర్’​, ‘బోల్డ్​ క్యారెక్టర్​ చేసే నటులు అరుదుగా ఉంటారు. అప్పట్లో ఆమిర్​ఖాన్​, రణ్​బీర్​కపూర్ ఇలాంటి పాత్రలను చేశా’రంటూ గుర్తుచేసుకుంటున్నారు.

Related posts