కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు అయ్యింది. విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై శ్రీకోదండరామాలయం శంకుస్థాపన సమయంలో విధులకు ఆటంకం కలిగించారని ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజు సహా మరికొందరిపైన పై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అందరిపైన .. 473, 353 సెక్షన్ల కింద అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు పోలీసులు..

కాగా…రామతీర్థం బోడికొండపై శ్రీరాముడి విగ్రహం గత ఏడాది క్రితం ధ్వంసమైంది. అయితే ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈ నెల 22 కోదండరామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమం గురించి ఆలయ ధర్మకర్తనైనా తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని , సంప్రదాయాలను పక్కనపెట్టారని ఆశోక్‌గజపతి ఆగ్రహించారు.

తనను కొబ్బరికాయ కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేసిన అశోక్ గజపతి.. అక్కడున్న శిలా ఫలకం బోర్డును కింద పడేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఆశోక్ గజపతిరాజుకు అధికారులు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకొంది. శంకుస్థాపన స్థలంలోనే బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో గజపతిరాజుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మధ్య వాగ్వాదం జరిగింది.
మరోవైపు ఈ ఘటనపై అశోక్ గజపతి రాజు తీరును తీవ్రంగా తప్పుపట్టారు వైఎస్ ఆర్ సీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్.


పోలవరం టెండర్లను రద్దు చేసి ఏం సాధిస్తారు?: పవన్ ఫైర్