telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం.. 60 మందికి పాజిటివ్

కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9.42 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 6,096 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 948231 కు చేరింది. ఇందులో 905266 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 35592 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 20 మంది మృతి చెందారు. ఇది ఇలా ఉండగా.. ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కరోనా సెకండ్ వేవ్ భయం నెలకొంది. ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకింది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ గా పని చేస్తున్న పద్మారావ్ కరోనా తో మృతి చెందారు. నిన్న సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వాటి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. 

Related posts