telugu navyamedia
తెలంగాణ వార్తలు

నిధుల దుర్వినియోగం..

జమ్మికుంట మున్సిపాలిటీ లో జరిగిన నిధుల దుర్వినియోగం పై ఉన్నత అధికారులు విచారణ జరిపించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. జమ్మికుంట బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యలపై పట్టణ అభివృద్ధి పైన ప్రతినెల నిర్వహించవలసిన సమావేశం కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. అనంతరం హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది. ఎన్నికల అనంతరం ఏర్పాటు చేయవలసిన సమావేశాన్ని మున్సిపల్ కౌన్సిలర్ల తీర్మానం లేకుండానే మున్సిపల్ చైర్మెన్, కమిషనర్ అధికారులతో కుమ్మక్కై ఇష్టానుసారంగా బిల్లులు చెల్లించి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని దీనిపై విచారణ చేపట్టాలని కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు, కలెక్టరుకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కలెక్టర్ వెంటనే స్పందించి మున్సిపల్ నిధులను వినియోగం పై విచారణ చేపట్టి దానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని తిరిగి రికవరీ చేయాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రవెల్లి సంపత్ రావు, మున్సిపల్ మాజి చైర్మెన్ శీలం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts