*హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
*బేగం పేట ఎయిర్‌పోర్టునుంచి బీజేపీ సభకు
*టీఆర్ ఎస్ పాలనపై ప్రధాని మోదీ విమర్శలు..
*యువతతో కలిసి తెలంగాణాను ఉన్నత శిఖరాలకు తీసుకువెళతాం..
*తెలంగాణను టెక్నాలజీ హబ్ గా చేయాలనుకుంటున్నాము..
*బేగం పేట ఎయిర్‌పోర్టునుంచి బీజేపీ సభకు
*భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు..
*తెలంగాణ అమరవీరులకు నా వందనలు..
*తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన ప్రధాని మోదీ..
*ఒక కుటుంబ పాలన తెలంగాణ ఉద్యమం జరగదు..
*పేదలు సమస్యలు వారికి పట్టవు..
*తెలంగాణలో మార్పు తథ్యం..
*తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే
భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నాం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకున్న ఆయన.. అక్కడ బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన స్వాగత సభలో తెలుగులో ప్రసంగం ప్రారంభించారు..
ఇంత ఎండలో చెమటలు కారుస్తూ వచ్చిన కార్యకర్తలకు కృతజ్ఞతలని, మీ ప్రేమే నా బలం… తెలంగాణకు ఎప్పుడొచ్చినా మీ రుణం పెరిగిపోతోంది అనిపిస్తోందని మోదీ అన్నారు. పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పాలనపై పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణ ఓ కుటుంబం నాశనం చేయాలని చూస్తోందని, కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుందని టీఆర్ఎస్‌కు చురకలు అంటించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నా నివాళులు. ఉద్యమంలో వేలాది మంది మరణించారు. అమరుల ఆశయాలు నెరవేరడం లేదు. ప్రజలు కలలు సాకారం కాడం లేదు.
నిరంకుశ తెలంగాణలో ఎవరికీ తెలంగాణలో నెరవేరడం లేదు. టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ ఎదుగుతోంది. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవాళ్లు నాడూ ఉన్నారు. నేడూ ఉన్నారు. యువతతో కలిసి తెలంగాణను మేం ఉన్నత శిఖరాలను తీసుకెళ్తాం. దేశ ఐక్యత కోసం సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.” అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని, కేవలం ఒక కుటుంబం కోసం తెలంగాణ రాలేదని. కుటుంబ పార్టీను తరిమేస్తేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుందని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యానికి కుటుంబ పార్టీలు ప్రమాదకరమని అన్నారు. కుటుంబ పార్టీలు అధికారంలో ఉంటే అవినీతి పెరుగుపోతుందని అన్నారు.
కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలని అన్నారు. తెలంగాణ లో మార్పు ఖాయం.. తెలంగాణలో 2024లో బీజేపీ గెలుపు తథ్యమని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత పోరాటమైనా చేస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర పథకాల పేర్లు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారని.. అయినా ప్రజల మనసులో బీజేపీని తీసేయలేరన్నారు.