telugu navyamedia
క్రీడలు

సింధుకు ఐస్ క్రీమ్ తెప్పించిన ప్రధాని

బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని ఎలా తెలిసిందో గానీ బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో టోక్యో 2020 ఒలింపిక్ క్రీడాకారుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్రీడాకారులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని పీవీ సింధు శాలువాతో సత్కరించింది. ప్రధాని మోదీ అందరితో మాట్లాడుతూ సింధు దగ్గరకు వచ్చారు. ప్రధాని ఆత్మీయ పలకరింపుతో సింధు ఉక్కిరిబిక్కిరై పోయింది. వైజాగ్ లో బాడ్మింటన్ స్టేడియంకోసం ప్రభుత్వం తనకు స్థలం కేటాయించిందని, అయితే ప్రస్తుతం తనద్రుష్టి అంతా బాడ్మింటన్ మీదనే ఉందని చెబుతోంది. అంతలో ప్రధాని తనదగ్గరకు వచ్చిన వెయిటర్ తో “ముందు సింధుకు ఐస్ క్రీమ్ ఇవ్వు” అన్నారు. ఐస్ క్రీమ్ పేరు చెప్పగానే సింధు ముఖంలో చెప్పలేనంత సంతోషం.

ప్రధాని అభిమానానికి , ఆత్మీయతకు సింధు పరవశించిపోయింది అప్పుడు తన విజయానికి కారణమైన దక్షిణ కొరియా క్రీడాకారుడు, కోచ్ ‘పార్క్’ ను పరిచయం చేసింది. పార్క్ భుజం తట్టి ప్రధాని ఆత్మీయంగా మాట్లాడారు . “అయోధ్య గురించి తెలుసా?” అని పార్క్ ను ప్రధాని అడిగారు. “తెలియదు”అని పార్క్ సమాధానం చెప్పారు . “అయోధ్య చరిత్ర గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంతే కాదు ఒకసారి అయోధ్యను సందర్శించు” అని సలహా ఇచ్చారు మోదీ . అప్పుడు పార్క్ మోదీతో – “తాను రాత్రి భార్యతో మాట్లాడినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తున్నాని చెప్పాను. నిజంగానా మోదీ సార్ చాలా గొప్ప నాయకుడు” అని చెప్పింది.

Related posts