telugu navyamedia
క్రీడలు వార్తలు

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల జాబితా విడుదల…

బీసీసీఐ ఆటగాళ్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. తాజాగా ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం 28 మంది ఆటగాళ్లు నాలుగు కేటగిరల్లో చోటు దక్కించుకున్నారు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ పేరును బీసీసీఐ కాంట్రాక్టు నుంచి తప్పించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా.. ముగ్గురే ఏ ప్లస్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. ఇక శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, నవ్‌దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్‌తో సహా హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్ అందుకున్నారు. అక్టోబర్ 2020 నుంచి సెప్టెంబర్ 2021 వరకు ఈ వార్షిక వేతనాలు అమలుకానున్నాయి. బీసీసీఐ వార్షిక వేతనాల్లో ఏ ప్లస్ ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్ల జీతం అందనుండగా.. ఏ కేటగిరి ప్లేయర్లకు రూ.5 కోట్లు, బీ విభాగంలోని ఆటగాళ్లకు రూ. 3 కోట్లు, సీ కేటగిరి ప్లేయర్స్ రూ. కోటి రూపాయల వార్షిక వేతనం అందిస్తారు.

గ్రేడ్ ఏ ప్లస్(రూ.7 కోట్లు): విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా

గ్రేడ్ ఏ(రూ.5 కోట్లు): రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య

గ్రేడ్ బి(రూ.3 కోట్లు): వృద్దీమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్

గ్రేడ్ సి(రూ. 1 కోటి): కుల్దీప్ యాదవ్, నవ్‌దీ సైనీ, దీపక్ చాహర్, శుభ్​మన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్

Related posts