telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ధోని రిటైర్మెంట్ పై యువరాజ్‌ సింగ్ స్పందన

Dhoni

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతూ టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆగస్టు 15న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మహేంద్రసింగ్‌ ధోని రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్ ట్విటర్‌ దీనికి సంబంధించిన ఓ వీడియోను యువీ షేర్‌ చేశారు. “నీ గొప్ప కెరీర్‌కు అభినందనలు. 2007 టీ20 ప్రపంచ కప్‌, 2011 వన్డే ప్రపంచ కప్‌ విజయంలో నీతోపాటు భాగస్వామిగా ఉండటం పట్ల ఎంతో ఆనందించాను. రిటైర్మెంట్‌ అనంతరం మంచి భవిష్యత్‌​కు నీకివే నా శుభాకాంక్షలు” అని క్యాప్షన్‌ ఇచ్చారు యువీ. ఆయన షేర్‌ చేసిన వీడియోలో ధోనితో కలిసి దిగిన మరపురాని ఫొటోలు ఉన్నాయి. కాగా మిడిల్‌ ఆర్డర్‌లో విజయవంతంగా రాణించిన యువీ, ధోని జంట టీ-20, వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించింది.

Related posts