telugu navyamedia
pm modi నరేంద్ర మోదీ వార్తలు

మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో భారత ప్రధాని పర్యటన – ప్రధాని మోదీకి ఘన స్వాగతం, అత్యున్నత అవార్డు

మూడు దశాబ్దాల తర్వాత ఘనాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు.

రాజధాని అక్రాలోని ఒక హోటల్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఘనా పిల్లల బృందం తమ చేతుల్లో భారతీయ, ఘనా జెండాలను పట్టుకుని “హరే రామ హరే కృష్ణ” నినాదాలతో హృదయపూర్వకంగా స్వాగతిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది.

భారతీయ ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో ఘనా మొదటి దశ.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ బుధవారం(జూలై 03) ఘనా చేరుకున్నారు.

అక్కడ ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనా స్వాగతం పలికారు. మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఒకరు ఘనాను సందర్శించడం ఇదే తొలిసారి.

ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్‌తో పాటు 21-గన్ సెల్యూట్ ఇచ్చారు. ఘనాలో ప్రధాని మోదీకి ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డుతో ఘనా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.

Related posts