ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ… మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది . తాజా కేసులతో దేశంలో 2.98 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 60,753 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,23,546 కి చేరింది. ఇందులో 2,86,78,390 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,60,019 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1,647 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,85,137 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 97,743 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 27,23,88,783 మందికి వ్యాక్సిన్ అందించారు
previous post
next post
జగన్ అందుకే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు: ఎమ్మెల్సీ బుద్ధా