తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన ముగిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకల్లో పాల్లొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు .
ఈ సందర్భంగా ప్రధానికి గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ స్వాగతం పలికారు. గన్నవరం నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బయలుదేరారు.

భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహావిష్కరిస్తారు . అనంతరం భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగసభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు.ప్రధాని పర్యటనతో భీమవరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మరోవైపు భీమరవం పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ‘‘గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు హాజరయ్యేందుకు భీమవరం బయలుదేరాను.
అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నాను. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను మెరుగుపరుస్తుంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.

