వయనాడ్ బాధితులను ఆదుకునేందకు సౌత్ ఇండియా సినిమా హీరోలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ భారీ విరాళం అందించి తమ మంచి మనసు చాటుకున్నారు.
గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం వల్ల వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యానని చిరంజీవి తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
వారికి అండగా నిలిచేందుకు తమ వంతుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ. 1 కోటి విరాళం అందిస్తున్నట్లు చిరంజీవి, చరణ్ తెలిపారు.
జల ప్రళయం వల్ల నష్టపోయి బాధలో ఉన్న వారందరూ త్వరగా కోలుకోవాలని, ఆ భగవంతుడు వారికి ఆ శక్తిని అందించాలని ప్రార్థిస్తున్నట్లు తన ఎక్స్ పేజీలో మెగాస్టార్ పేర్కొన్నారు.