telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

నూతన సంవత్సరంలో అందరూ మొక్కలు నాటాలి: అమల

Actor Amala meets minister IK Reddy

నూతన సంవత్సరంలో అందరూ మొక్కలు నాటాలని ప్రముఖ నటి అక్కినేని అమల పిలుపునిచ్చారు. ఈరోజు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తమ నివాసంలో 5 ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని పేర్కొన్నారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా కార్యక్రమం విజయవంతమవడం సంతోషం. ఇలాంటి మంచి ఆలోచనలు అరుదుగా వస్తాయనీఅన్నారు. వాటిని ఆచరణలో పెట్టడం ముఖ్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటిన అనంతరం ఆమె మరో నలుగురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.

Related posts