ఆస్ట్రేలియాలోని ఓ ఎయిర్‌క్రాఫ్ట్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్న ఓ ట్రైనీ పైలట్‌కు సరిగ్గా నిద్రలేకపోవడంతో విమానం నడుపుతూ నిద్రపోయాడు. తలనొప్పి రావడంతో విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి నిద్రలోకి వెళ్లిపోయాడు. అలా 5500 అడుగుల ఎత్తులో 40 నిమిషాల పాటు విమానం ఆటో మోడ్‌లో ప్రయాణించింది. దక్షిణ ఆస్ట్రేలియాలోని పోర్ట్ అగస్టా ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం ఆటోమోడ్‌లో అడెలైడ్ ప్యారాఫీల్డ్ ఎయిర్‌పోర్టు సమీపానికి చేరుకుంది. అడెలైడ్ కంట్రోల్డ్ ఎయిర్‌స్పేస్‌కు క్లియరెన్స్ లేకుండా విమానం వస్తుండటంతో ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ పైలట్‌ను సంప్రదించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ లాభం లేకపోయింది. ఇక అదే విమానానికి సమీపంలో ప్రయాణిస్తున్న మరో విమానం ద్వారా ప్రయత్నించగా.. పైలట్‌కు మెలకువ వచ్చింది. వెంటనే విమానాన్ని సేఫ్‌గా అడెలైడ్ ప్యారాఫీల్డ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశాడు. దీనిపై ఎయిర్‌క్రాఫ్ట్ ట్రైనింగ్ స్కూల్ యాజమాన్యం స్పందించింది. తమ ట్రైనీ పైలట్‌కు ముందు రోజు నిద్ర లేదని, విమానం నడిపే రోజు కూడా కేవలం చాక్లెట్ తప్ప ఆహారం ఏం తీసుకోకపోవడంతో ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. పైలట్‌ల నిద్ర, తిండి విషయంలో తాము అనేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నామన్నారు.
previous post
next post