telugu navyamedia
సాంకేతిక

పిల్లలని సైకోలు గా టెర్రరిస్టులు గా మారుస్తున్న సెల్ ఫోన్స్ ..

పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త
కొన్నాళ్ల క్రితం ఢిల్లీ లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 2వ తరగతి పిల్లాడిని అదే స్కూల్ కు చెందిన 11 తరగతి అబ్బాయి స్కూల్ టాయిలెట్‌లో చంపేశాడు.
కారణం? స్కూల్లో ఎవరైనా చస్తే పరీక్షలు పోస్ట్‌ పోన్ అవుతాయి అని.

ఏమండీ 16 ఏళ్ళ పిల్లాడికి 7 ఏళ్ళ పిల్లాడిని చంపాలని ఆలోచన రావడమేంటి ?
అందులో ఏదో ఆవేశంతో తోస్తే కింద పడి చనిపోయిన బాపతు కాదు కదా?
మీరు భయ పడకండి.
ఎగ్జామ్స్ పోస్ట్‌ పోన్‌ అవుతాయి.
నేనే ఏదోకటి చేస్తాను అని ఆ బాల రాక్షసుడు రెండు రోజల ముందు నుంచి క్లాస్ మేట్స్ కు చెప్పాడు .

స్కూల్ కు కత్తి తెచ్చి ప్లాన్ చేసి చంపేశాడు.
టెర్రరిస్ట్‌లు కూడా ఇంత చిన్న కారణానికి అందునా పసి పిల్లని చంపడానికి వెనకాడుతారు.
కానీ ఒక స్కూల్ పిల్లాడు ఇలా చేశాడు అంటే కారణం ఏంటి అని ఎవరు పెద్దగా ఆలోచించలేదు.
ఒకే ఒక్క రోజు అది బ్రేకింగ్ వార్త అయ్యింది.

అమ్మా! ఢిల్లీలో పిల్లలు ఇలా వుంటారా అని అని కాసేపు క్రైమ్ సీరియల్ చూసినట్టు అందరూ ఒక్క నిట్టూర్పు విడిచి అక్కడితో వదిలేసారు.

సరిగ్గా అలాంటి సంఘటనే ఆ తరువాత లక్నోలోని బ్రైట్ ల్యాండ్ స్కూల్‌లో జరిగింది. ఇక్కడ ఒకటో క్లాస్ అబ్బాయి ని అదే స్కూల్ కు చెందిన ఆరవ క్లాస్ అమ్మాయి పొడిచింది.
ఇదేదో ఎక్కడో జరిగిన ఒకటి అరా సంఘటనలు కావు.

ఒక టీవీ డిస్కషన్ బ్రేక్ లో ఒక వ్యక్తి చెప్పారు.
రంగారెడ్డి జిల్లా లో ఒక ప్రభుత్వ స్కూల్ కు చెందిన ఆరవ తరగతి అబ్బాయి తన స్కూల్ మేట్స్ ను మోసం చేసి రూ.35 వేలు పోగేశాడట. అమ్మ నాన్నకు తెలియకుండా మిమ్మల్ని టూర్ కు తీస్కొని వెళతాను అని చెప్పాడట.

చివరకు బ్లాక్ మెయిలింగ్ కు దిగాడట!
పిల్లలలో ఇంత క్రిమినల్ మనస్తత్వం ఎందుకు పెరుగుతోంది.

గత కొన్ని నెలలుగా నెత్తి నోరు బాదుకుని చెబుతూనే ఉన్నా…
అయ్యా పిల్లల చేతిలోకి స్మార్ట్ ఫోన్ ఇచ్చేసారు.

వారు అందులో అతి భయానక దృశ్యాలు ఉన్నా వీడియో గేమ్స్ ఆడుతున్నారు.
గత కాలం పిల్లలు కబాడీ, ఖోఖో లాంటి గేమ్స్ ఆడితే ఇప్పటి పిల్లలు చంపడం ఒక ఆటగా తయారు అయ్యింది.

అమ్మలకేమో టీవీలో సీరియళ్ళు పిచ్చి.
నాన్నలకు చెత్త రాజకీయాల పిచ్చి.
టీవీలకు సంచలన వార్తలు కావాలి.
పిల్లలు మాత్రం ఎవరికీ అక్కర్లేదా?
బాలల లోకాన్ని ఎప్పుడో కల్మషం చేసేశారు.

ఇప్పుడు ఇప్పుడు వారిని మనం టెర్రరిస్ట్‌లుగా తయారు చేస్తున్నాం.
ఇంటి ఇంటిలో ఒక టెర్రరిస్ట్ తయారు అవుతున్నాడు.
మీడియా పట్టించుకోదు.
ప్రభుత్వాలు ఏమీ చెయ్యవు.
మీ పిల్లల్ని మీరే రక్షించుకోవాలి.
నీలి చిత్రాలు, హింసాత్మక వీడియో గేమ్స్, మద్యపానం, ధూమపానం, ఇవన్నీ ఆధునిక రోగాలు.
వీటిని ఒకరి నుంచి మరొకరికి వ్యాపింప చేసే దోమ స్మార్ట్ ఫోన్.
స్మార్ట్ ఫోన్‌ను మీ పిల్లలకు దూరంగా ఉంచండి.
ఇంట్లో కంప్యూటర్ ఏర్పాటు చేయించండి.
దానిపై చైల్డ్ లాక్ లాంటి ఫీచర్స్ ఇన్‌స్టాల్‌ చెయ్యండి.
పిల్లని ఒక కంట కనిపెట్టండి.
పిల్లలతో సమయం గడపండి.
వారితో మాట్లాడండి.
వారు చెప్పేది వినండి.

కేవలం ధనాపేక్షే ద్యేయంగా కాక పిల్లలకు మోరల్ వాల్యూస్ నేర్పే
స్కూల్స్‌లో వారిని చేర్పించండి.

మన పిల్లని రక్షించుకొందాం. లేక పొతే మనం సర్వనాశనం అయిపోతాం.
నా బాధను నలుగురితో పంచుకోండి.

ఈ విషయాన్నీ తల్లి తండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి
మీ పిల్లల భవిషత్ కు బంగారు బాటలు వేయండి

Related posts