telugu navyamedia
విద్యా వార్తలు

పుస్తక పఠనం

తనకు ఉరివేసే క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి

– భగత్ సింగ్

మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి “ఇక్కడ పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నారు” అని అన్న వారు

– బెడ్రంట్ రసెల్

మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పినవారు

– ఆల్బర్ట్ ఐన్ స్టిన్

ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరినవారు

-నెల్సన్ మండేలా

తుపాకీ కంటే పెద్ద ఆయుధం పుస్తకం అన్నారు .పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు వచ్చి కానుకగా పడ్డ ఆవ్యక్తి

– లెనిన్

ఒక్కో చిత్రంలో నటించాక తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనే వ్యక్తి

-చార్లీ చాప్లిన్

ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే పుస్తకమే అన్నవారు

– విన్ స్టన్ చర్చిల్

భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు పుస్తకాలని చెప్పినవారు

-మార్టిన్ లూథర్ కింగ్

నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు

– అబ్రహం లింకన్

వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటే చూపండి, అతడే నా మార్గదర్శి అన్నవారు

-జూలియస్ సీజర్

ప్రపంచపటంలో కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా,అయితే గ్రంథాలయానికి వెళ్ళు అన్నవారు
-టెస్కార్డ్స్

జీవితం విరక్తి చెందినప్పుడు లేదా కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నవారు
-ఇంగర్సాల్

వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో, అలా
పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నవారు
-సిగ్మెండ్ ఫ్రాయిడ్

పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం

ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే

ముఖపుస్తకం (Facebook) పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము

చదవాలి అనే ఆలోచన, ఆసక్తి ఉంటే చాలు ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి చదవండి, చదివించండి

Related posts