telugu navyamedia
రాజకీయ వార్తలు

6 రాష్ట్రాలు మరియు 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో 5వ దశ పోలింగ్ ప్రారంభమైంది

ఈ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తలపడుతున్నారు.

మొత్తం 695 మంది అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. ఈ దశలో ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు కాగా ఇందులో మహిళలు 4.26 కోట్లుగా ఉన్నారు..

ఈ దశలో మహారాష్ట్రలో 13 సీట్లు, ఉత్తరప్రదేశ్లో 14 సీట్లు, పశ్చిమ బెంగాల్లో 7 సీట్లు, బీహార్లో 5 సీట్లు, ఝార్ఖండ్లో 3 సీట్లు, ఒడిశాలో 5 సీట్లు, జమ్మూకశ్మీర్, లడఖ్ లలో ఒక్కొక్క సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.

Related posts