మూడవ దశలో పిల్లలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ వేవ్‌లో ప్రభుత్వ లెక్కలు ప్రకారం.. ఒక్క శాతం కంటే తక్కువ మంది పిల్లలకు కరోనా సోకగా.. సెకండ్ వేవ్‌లో, మాత్రం పిల్లలలో సంక్రమణ రేటు 10 శాతం వరకు పెరిగింది. పిల్లలు ఇంకా వ్యాక్సిన్ కూడా పొందలేదు. దీనిని బట్టి చూస్తే.. పిల్లలకే 80శాతం వరకు ప్రమాదం మూడవ వేవ్‌లో ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజర్లు వాడడం కరోనా రాకుండా ఉండడానికి ముఖ్యమైన అంశాలు కాగా.. వారికి ఆ నిబంధనలు అర్థం చేసుకునేంత మెచ్యురిటీ కూడా ఉండదని, అటువంటి పరిస్థితిలో కరోనా వేగంగా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మే చివరివరకు కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉండగా.. జూన్‌లో ఒకవేళ స్కూళ్లు తెరుచుకుంటే కరోనాను అడ్డుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు.
ఫస్ట్ వేవ్‌లో ఉన్నప్పుడే సెకండ్ వేవ్ గురించి వైరాలజీ నిపుణులు హెచ్చిరించినా పట్టించుకోలేదు. సెకండ్ వేవ్‌లో మరణాలు శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పినా.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు మరణాల శాతం బాగా పెరిగిపోయింది. మార్చి మొదటి వారంలోనే రెండోదశ ప్రారంభం అవ్వగా.. ఏప్రిల్, మే నెలల్లో తీవ్రంగా మారిపోయింది. జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర పరాషర్ చెబుతున్న వివరాల ప్రకారం.. కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. సాధారణంగా వైరస్ ప్రభావం ఎనిమిది వారాల వరకు ఉంటుంది. ఈ లెక్క ప్రకారం.. మే చివరివరకు ఈ వేవ్ ప్రభావం తగ్గుతుంది. మాస్కులు పెట్టుకోకపోవడం, గుంపులుగా చేరడం.. రాజకీయ ర్యాలీలు, కుంభమేళాలు.. సెకండ్ వేవ్ ప్రభావాన్ని పెంచాయి. మూడవ వేవ్ మాత్రం.. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోతే.. స్కూళ్లు ఓపెన్ చేసినట్లైతే పిల్లలు ప్రమాదంలో పడవచ్చు అని అంటున్నారు.
దళితులపై దాడులను జగన్ ఎందుకు ఖండించడం లేదు?: చంద్రబాబు