విద్యార్థులకు కీలక సూచన చేశారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. ప్రతీ విద్యార్థి చదవాల్సిన ఓ పుస్తకాన్ని పంచుకున్నారు.
పాల్ జి హెవిట్ రాసిన కాన్సెప్చువల్ ఫిజిక్స్ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని విద్యార్థులకు సూచించారు. ఈ పుస్తకాన్ని రచయిత అద్భుతంగా రాశారన్నారని, భారతీయ భాషలన్నింటిలోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఓ ప్రముఖ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో నారాయణమూర్తి, ప్రస్తుతం నేను ఫిజిక్స్ పుస్తకాన్ని చదువుతున్నా. హైస్కూల్ టీచర్ పాల్ హెవిట్ అనే ఆయన ఈ పుస్తకాన్ని రాశారు.
హైస్కూల్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అద్భుతంగా రాశారు. ఫిజిక్స్ ఎలా బోధించాలో వివరించారు. రచయిత అనుమతిస్తే ఊ పుస్తకాన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉంది.
ఇందులో అద్భుతమైన ఎక్సర్ సైజులు ఉన్నాయి. క్లిష్టమైన ఐడియాలను చాలా చక్కగా, సునాయసంగా అర్థం చేసుకునేలా వివరించారు.
శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు, మేఘాలయ నుంచి జామ్‌నగర్ వరకు ప్రతీ ఒక్కరూ ఈ పుస్తకం చదవాలి. సైన్స్, ఇంజినీరింగ్, మేథమేటిక్స్, టెక్నాలజీ సబ్జెక్టుల్లో మంచి అవగాహన ఏర్పడుతుంది.
మరోవైపు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై వస్తున్న ఆందోళనలపైనా స్పందించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయాలు నెలకొన్న వేళ ఆ వాదనలను నారాయణ మూర్తి కొట్టి పారేశారు.
ఏఐని మరీ ఎక్కువ చేసి చూపుతున్నారన్నారు. కొత్త అవకాశాల సృష్టి, మనుషుల ఉత్పాదకతను పెంచే సామర్థ్యం ఈ ఏఐకి ఉందన్నారు.
1970ల్లోనూ ఇలాంటి అపోహలు వినిపించాయని, కేస్ టూల్స్ అనే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ టూల్స్ అందుబాటులోకి వచ్చినప్పుడు అనేక భయాలు వ్యాపించినట్లు గుర్తు చేసుకున్నారు.
దీంతో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు ఊడిపోతాయనే ప్రచారం సైతం జరిగిందన్నారు. కానీ, రానురానూ మరింత క్లిష్టమైన సమస్యలు ఎదురయ్యాయని..
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంకా అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు.