telugu navyamedia
వ్యాపార వార్తలు

నేడు పెరిగిన.. పెట్రోల్ ధరలు..

petrol prices in marktets

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. మొన్నమొన్నటి వరకు పైసాపైసా తగ్గినా పెట్రోల్ ధరలు, మళ్ళీ అదే స్థాయిలో పెరుగుదలను నమోదు చేసుకోవడం మొదలైంది. అమెరికా, చైనాల వాణిజ్య సంబంధాలలో అనిశ్చితి కొనసాగుతుండడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా కూడా చమురు ధరలు పెరిగాయి. ఈరోజు దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 19 నుంచి 29 పైసల మధ్య పెరిగాయి.

దేశ రాజధాని దిల్లీ నగరంలో లీటరు పెట్రోల్‌ ధర 19పైసలు పెరిగి రూ.69.07కు చేరింది. లీటరు డీజిల్‌ ధర 28పైసలు పెరిగి రూ.63.10గా ఉంది. ముంబయిలో ఇవాళ పెట్రోల్‌ ధర 19పైసలు పెరిగింది. దీంతో లీటరు పెట్రోల్‌ రూ.75కు చేరింది. డీజిల్‌ లీటరుకు 30పైసలు పెరిగి రూ.66గా, హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.41కి, డీజిల్ ధర రూ. 68.57గా ఉంది. అలాగే చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.71.76కు, లీటరు డీజిల్ ధర రూ.66.60కు చేరాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌ ధర రూ.71.39కు చేరగా, లీటరు డీజిల్‌ ధర రూ.64.97గా ఉంది.

Related posts