telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

సరికొత్త ఫీచర్లతో .. వివో యూ10 ..

vivo u10 released and available from 29th

వివో మొబైల్ ఉత్పాదక సంస్థ తన యూ10 మోడల్‌ను విడుదల చేసింది. దీనిని ఈ నెల 29 అందుబాటులోకి తీసుకురానుంది. దీని ప్రారంభ ధర రూ.8,900గా నిర్ణయించారు. దీనిలో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌, ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉన్నాయి. వివో యూ10 ప్రాథమిక వేరియంట్‌ ధర రూ.8,990, 3జీబీ ర్యామ్‌, 32 జీబీ మెమొరీ ఉంటుంది. రెండో మోడల్‌లో 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ మెమొరీ ధరను రూ.9,990గా, 4జీబీ ర్యామ్‌,64జీబీ మెమొరీ ఉన్న ఫోన్‌ధర రూ.10,990గా నిర్ణయించారు.

యూ10 ఫీచర్లు :

* 6.35 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే

* స్నాప్‌ డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌

* వెనుకవైపు 13+8+2 మెగాపిక్సెల్‌ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌

* ముందు 8మెగాపిక్సెల్‌ కెమెరా

* 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ

Related posts