వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌కు మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 నిబంధనను అతిక్రమించినట్లు ఐసీసీ పేర్కొంది. అంతేకాకుండా అతని ఖాతాలో ఒక డీమెరీట్ పాయింట్ కూడా పడింది.
ప్రస్తుతం అతని ఖాతాలో రెండు డీమెరీట్ పాయింట్లు ఉన్నాయి. భారత ఇన్నింగ్స్ 42వ ఓవర్‌లో తాను వేసిన ఓ బంతిని అంపైర్ వైడ్ ఇవ్వడంతో బ్రాత్‌వైట్ అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్ అనంతరం మ్యాచ్ రిఫరీ క్రిస్‌బ్రాడ్ ముందు బ్రాత్‌వైట్ తన తప్పును అంగీకరించడంతో ఐసీసీ అతనిపై జరిమానా విధిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.