టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న మల్టీస్టారర్ `వెంకీమామ`. విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ కోసం ఇద్దరి హీరోల అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. “గోదావరిలో ఈత నేర్పా..బరిలో ఆట నేర్పా..ఇపుడు జాతరలో వేట నేర్పిస్తా..రారా అల్లుడు” అంటూ వెంకీ మామ ట్రైలర్ లో వచ్చే డైలాగ్స్ అందరినీ అలరిస్తోన్న విషయం తెలిసిందే. ఇపుడు ఇవే డైలాగ్స్ ను సినిమా హీరోయిన్లు పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా డబ్ స్మాష్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేశారు. చిత్రయూనిట్ వెళ్తున్న బస్సులో పాయల్, రాశీ ఖన్నా డైలాగ్స్ చెబుతుండగా మధ్యలో చైతూ వస్తాడు. ఈ టిక్ టాక్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#venkymama 😎#VenkyMamaFromDec13th ✨ pic.twitter.com/qRxsLs74L7
— Raashi Khanna (@RaashiKhanna) December 7, 2019
ఈ చిత్రంలో వెంకటేశ్ రైతుగా, నాగచైతన్య ఆర్మీ ఉద్యోగిగా కనిపించనున్నారు. వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో రావురమేశ్, నాజర్, ప్రకాశ్‌రాజ్ అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్‌లో నిర్మాత సురేశ్ బాబు నిర్మించగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకున్నఈ ‘వెంకీమామ’ చిత్రం డిసెంబర్ 13న విడుదలకానుంది. సెన్నార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.


తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా ?… : బాలకృష్ణ