పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తున్న నేపథ్యంలో ఆర్టీవీ అధినేత రవిప్రకాశ్ చేసిన ఓ ట్వీట్ చేసారు.
పవన్ నటన, మేనరిజమ్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదే క్రమంలో ఆర్టీవీ అధినేత రవిప్రకాశ్ ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్‌ను అభినందించారు. “మీరు ఎప్పటికీ ఓజీనే. ఎల్లప్పుడూ ప్రజల ఛాంపియన్‌గా నిలుస్తారు.
మీ విజయానికి, మీరు సాధిస్తున్న భారీ వసూళ్లకు అభినందనలు పవన్ కల్యాణ్” అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.