telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని మార్పుపై.. జీఎన్‌రావు కమిటీ నివేదికలో కొత్త విషయం

gn rao reply on chandrababu comments

రాజధాని మార్పుపై ఏపీ ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలో ఓ కొత్త విషయం వెలుగు చూసింది. విశాఖపట్టణాన్ని రాజధానిని చేస్తే వచ్చే అడ్డంకులను వివరంగా పేర్కొంది. పర్యావరణ పరంగా విశాఖ చాలా సున్నితమైన ప్రాంతమని, ఇక్కడ తుపానులు, వరదలతో ముప్పు పొంచి వుందని స్పష్టం చేసింది.

కోస్టల్ రెగ్యులేటరీ జోన్‌లకు ఉండే అడ్డంకులు, భూగర్భ జలాల్లో ఉప్పు నీరు చేరడం వంటి సమస్యలున్నాయని కమిటీ స్పష్టంగా పేర్కొంది. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే విశాఖను మూడు రాజధానుల్లో ఒకటిగా ప్రభుత్వం పేర్కొంది. ఆ కమిటీ పేర్కొన్న అవరోధాలను మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఈ విషయాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.

Related posts