telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హైదరాబాద్ మెట్రోలో పవన్ కళ్యాణ్ ప్రయాణం… కారణం ఇదే

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇవాళ హైదరాబాద్‌ మెట్రో రైలులో ప్రయాణించారు. వకీల్‌ సాబ్‌ సినిమాలో నటిస్తున్న ఆయన వియాపూర్‌ వెళ్లేందుకు మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. మరోసారి సినిమా షూటింగుల కోసం ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా నగరంలో మెట్రో రైలులో ప్రయాణించారు. మాదాపూర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రోలో పవన్‌ ప్రయాణించారు. కాగా..పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ రూపొందుతోంది. ఈ సినిమాను దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ సరసన శ్రుతీ హాసన్ నటిస్తోంది. నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై పవన్‌ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పార్టు పూర్తి కావాల్సింది. కానీ లాక్ డాన్ కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది.

Related posts