తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన నటించిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. సురేందర్‌రెడ్డి దర్శకుడు. అమిత్ త్రివేది స్వరకర్త. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టేజ్‌పై పవన్ మాట్లాడుతుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. పవన్ మాట్లాడుతుంటే… ఒక్కసారిగా ఓ వ్యక్తి స్టేజ్‌పైకి ఎక్కి పవన్ కల్యాణ్ కాళ్లపై పడిపోయాడు. దీంతో వెంటనే అక్కడున్న బాడీగార్డ్స్ అంతా అతడ్ని పట్టుకొని ఆపే ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ వెంటనే వారిని ఆపి అతడ్ని వదలమన్నారు. బౌన్సర్లను గట్టిగా గద్దించారు. ఆప్ లోగ్ చలే జాయియే అంటూ పవన్ కల్యాణ్ వారిపై సీరియస్ అయ్యారు. బౌన్సర్లు అభిమానిని వదలకపోవడంతో మరోసారి వారిపై గట్టిగా అరిచారు. చలియే ఆప్ అంటూ మరోసారి వారిపై ఫైర్ అయ్యారు పవన్. ఆ తర్వాత తన కోసం వచ్చిన అభిమానిని గట్టుకొని హత్తుకున్నారు. అతని భుజంపై తట్టి పంపించారు.



ఆ సినిమాలు చేయను… దర్శకులకు నచ్చకపోవచ్చు : రష్మిక