telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మైదాన్ నుండి.. ప్రియమణి ఇన్ … కీర్తి సురేష్‌ అవుట్..

priyamani fixed for bollywood maidan movie

ఇటీవలే విడుదలైన ‘తాన్హాజీ’ చిత్రంతో అజయ్ దేవగన్ మరోసారి గుర్తింపు పొందాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయవంతమయ్యింది. అజయ్ దేవగన్ అప్ కమింగ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా ‘మైదాన్’కు సంబంధించిన అప్‌డేట్స్ బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో అజయ్ దేవగన్ సరసర దక్షిణాది నటి ‘ప్రియమణి’ నటించనున్నదని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో తల్లి పాత్ర కోసం నటి కీర్తి సురేష్‌ను సంప్రదించారని, అయితే ఈ పాత్రకు ఆమె సూట్ కాదని చిత్రయూనిట్ భావించిందని సమాచారం. ఈ నేపధ్యంలోనే ఆ పాత్ర ప్రియమణిని వరించిందని అంటున్నారు.

ఈ రెండు పాత్రలు ఒకటా కాదా అనేది తెలియాల్సివుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ ఫుట్‌బాల్ కోచ్‌గా నటిస్తున్నారు. అమిత్ రవీంద్రనాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నవంబరు 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Related posts