యేసుక్రీస్తు బోధనలు వర్తమాన సమాజానికి మార్గ దర్శకాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. క్రైస్తవులకు పవన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘క్రైస్తవ సోదరులందరికీ నా తరఫున, జనసైనికుల తరఫున క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను ఏసు క్రీస్తు ప్రపంచానికి అందించారు’ అని పవన్ పేర్కొన్నారు.’ధర్మం కోసం అడుగులు వేసే ఎవరైనా సత్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తారనేది క్రీస్తు జీవితం ద్వారా మనకు తెలుస్తుంది. సత్యాన్ని మానవాళికి ప్రకటించడంతో శాంతి, సహనాలను ఎక్కడా విడిచిపెట్టలేదని చెప్పారు.


ఓట్ల కోసమే అలా చేస్తుంది.. ప్రియాంకపై స్మృతి ఇరానీ ఘాటు వ్యాఖ్యలు