telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఏర్పాటు చేసిన 35వ బుక్ ఫెస్టివల్ను పవన్ కల్యాణ్ ప్రారంభించారు

జనవరి 2 తేదీ చెరుకూరి రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.

పుస్తకాలు ఉంటే ఇక ఉపాధ్యాయుల అవసరం కూడా ఉండదనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇంటర్తోనే చదువు ఆపేసాను అన్నారు.

కానీ పుస్తకాలను చదవడం మాత్రం ఆపలేదని డిప్యూటీ సీఎం తెలిపారు. తాను చదువుకోలేకనో లేక మార్కులు తెచ్చుకోలేకనో చదువు ఆపలేదన్నారు.

బాగా చదివేవాడినని కానీ తాను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా స్కూల్కు వెళ్లకుండానే ఇంటివద్ద నేర్చుకున్నాడని పుస్తకాల్లో చదివినట్లు చెప్పారు.

ఆయన ప్రేరణతో అదే బాటలో ముందుకు సాగానన్నారు.

తనకు తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందన్నారు. తాను ఎక్కడైనా కోటి రూపాయలు ఇచ్చేందుకు ఆలోచించను కానీ. పుస్తకం ఇవ్వాలంటే మాత్రం ఆలోచిస్తానన్నారు.

ఎవరైనా పుస్తకాలు అడిగితే కొనిస్తాను తప్ప తన వద్ద ఉన్న పుస్తకాలను మాత్రం ఇవ్వనని తెలిపారు.

Related posts